రాంగోపాల్ వర్మ కౌంటర్ బండ్ల గణేష్‌కు

- March 27, 2017 , by Maagulf
రాంగోపాల్ వర్మ కౌంటర్ బండ్ల గణేష్‌కు

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పవన్ కల్యాణ్ సినిమా విడుదల అనంతరం కొన్ని వివాదాస్పద ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్వీట్స్‌పై చెలరేగిన వివాదం అంతాఇంతా కాదు. నిర్మాత బండ్ల గణేష్ అయితే ఒకడుగు ముందుకేసి వర్మపై ట్వీట్ల రూపంలో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. రాంగోపాల్ వర్మ ఓ మొరిగే కుక్క అంటూ ఘాటుగా స్పందించాడు. పవన్ చెప్పుకున్న విలువ కూడా వర్మకు లేదని ట్వీట్ చేశాడు. వర్మ ఓ వీధి కుక్క అని పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్స్‌కు వర్మ తాజాగా కౌంటర్ అటాక్‌కు దిగాడు. మూతులు నాకే కుక్కల కన్నా మొరిగే కుక్కలు చాలా బెటర్ అని వర్మ ట్వీట్ చేశాడు. మొరిగే కుక్కలకు కుక్కల్లా ఎలా కరవాలో తెలుసని, కానీ మూతులు నాకే కుక్కలు ఎలుకల కంటే అధ్వానమని ట్వీట్ చేశాడు.
బండ్ల గణేష్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com