ఆరోగ్యానికి.. అందానికి మేలు చేసే పెరుగు.. ఎముకలు బలపడేలా?
- March 29, 2017
పిల్లలకు పెరుగు రోజూ వారీ ఆహారంలో చేర్చాలి. అలాగే పెద్దలు కూడా రోజూ రెండు కప్పుల పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని విటమిన్ బి 12 శరీరంలో ఎర్రరక్తణాల సంఖ్యను పెంచుతుంది. ఇంకా నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలోని ప్రో బయోటిక్స్ శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. ఇందులో లభించే కాల్షియం కారణంగా ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగులోని ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్థాలను శక్తి రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి. అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది. రోజూ పెరుగును తీసుకుంటే.. ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







