ముచ్చటగా మూడోసారి మెగా ఛాన్స్ కొట్టేసిన శ్రీకాంత్
- March 30, 2017
ఫ్యామిలీ హీరో గా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ , ప్రస్తుతం చిన్న చిన్న క్యారెక్టర్ రోల్ లలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యనే అల్లు అర్జున్ నటించిన సర్రాయినోడు మూవీ లో బన్నీ బాబాయ్ గా నటించి మంచి మార్కులు కొట్టేసి మెగా అభిమానాన్ని చొరగొన్న ఈ హీరో , తాజాగా మరో మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో రూపొందనున్న "ఉయ్యాలవాడ'' సినిమాలో శ్రీకాంత్ ఓ ముఖ్య రోల్ లో నటిస్తున్నాడట.
గతం లో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. మళ్లీ మూడో సారి చిరు తో నటించే ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఫై అధికారిక ప్రకటన రావాలి. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించనున్నాడనే ప్రచారం జరుగుతోంది.
అక్షయ్ ది నెగిటివ్ రోల్ అని అంటున్నారు. ప్రస్తుతం రోబో టూ లో కూడా అక్షయ్ నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో "ఉయ్యాలవాడ'' మూవీ తెరకెక్కుతుంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







