రెండో రోజు ఉర్రూతలూగించిన 'ఐఫా ఉత్సవం'

- March 30, 2017 , by Maagulf

సినీ పురస్కార వేడుకల తీరు తెన్నుల్నే మార్చేలా వరుసగా రెండోసారి హైదరాబాద్‌లో ఐఫా (ది ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ) ఉత్సవం జరిగింది. నిర్వహణ మొదలుకొని ఆటపాటల వరకు అన్నింట్లోనూ తారల్ని ప్రత్యక్షంగా భాగం చేస్తూ ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. మంగళవారం మొదలైన దక్షిణాది ఐఫా ఉత్సవంలో భాగంగా... రెండో రోజైన బుధవారం తెలుగు, కన్నడ పరిశ్రమలకి చెందిన తారలకి, సాంకేతిక నిపుణులకు పురస్కారాల్ని ప్రదానం చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలకి చెందిన తారలంతా ఒక చోటకి చేరి... ఒకరిపై మరొకరు చెణుకులు విసురుకొంటూ... పోటాపోటీగా ఆడిపాడటంతో ఆద్యంతం సందడిగా సాగింది ‘ఐఫా’ ఉత్సవం.

ఈ వేడుకలో రానా, నాని కలిసి చేసిన యాంకరింగ్‌తో పాటు... అఖిల్‌, సాయిధరమ్‌ తేజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌, కేథరిన్‌, రాశీ ఖన్నా, కృతిక, రాయ్‌లక్ష్మీ తదితరులు చేసిన సందడి వేడుకకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వేడుకలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. నాగార్జున చేతులమీదుగా ఆ గౌరవాన్ని స్వీకరించిన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘అన్నమయ్య దిగివచ్చి పురస్కారాన్ని అందించినంత ఆనందంగా ఉంది.

ఈ రోజు నాకు నిజమైన ఉగాది. నేను వేసిన పూలు, పండ్లని భరించిన కథానాయికల వల్లే నాకు ఈ పురస్కారం దక్కింద’’న్నారు. నాగార్జున మాట్లాడుతూ ‘‘కె.రాఘవేంద్రరావు నా గురువు, నా తండ్రిలాంటివారు. ఆయనతో చేసిన ప్రతి సినిమా ఓ మంచి జ్ఞాపకం.

ఆయనతో చిత్రీకరణ ఓ విహారయాత్రలా ఉంటుంది. కాకపోతే క్లోజ్‌లు ఎక్కువగా హీరోయిన్లకే వేస్తుంటారు. మమ్మల్నీ క్లోజప్‌లో చూపించండని ఆయన వెనకాల తిరుగుతుంటామ’’న్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీజీపీ అనురాగ్‌ శర్మతో పాటు, సినీ ప్రముఖులు వెంకటేష్‌, ఎన్టీఆర్‌, జయప్రద, ఖుష్బూ, సమంత, రవిచంద్రన్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ఆదాశర్మ, దేవిశ్రీప్రసాద్‌, రీతూ వర్మ, అక్షర హాసన్‌, ముమైత్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

అవార్డు గ్రహితల లిస్ట్

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com