సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయంలో రన్‌వేపై ఢీకొన్న విమానాలు
- March 30, 2017
సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయంలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. రన్‌వేపై టేకాఫ్ అవుతున్న రెండు విమానాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అయితే పైలెట్లు అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పి.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
303 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో చైనాలోని టియాంజిన్ వెళ్తున్న స్కూట్ ఎయిర్‌లైన్ విమానం చాంగీ ఎయిర్‌పోర్టు రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో స్కూట్ విమానం లెఫ్ట్ వింగ్.. అదే రన్‌వేపై టేకాఫ్ చేసుకుంటున్న ఎమిరేట్స్ విమానాన్ని తాకాయి.
అయితే పైలెట్లు అప్రమత్తమై విమానాలను ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులను దింపేసి.. దెబ్బతిన్న విమానాలను రిపేర్‌కు పంపించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేశారు.
ఎమిరేట్స్ విమానం దుబాయికి వెళ్లాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







