పూరి జగన్నాథ్ 'రోగ్' మూవీ రివ్యూ
- March 31, 2017
రివ్యూ : రోగ్
నటినటులు : ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా అనూప్‌సింగ్, ఆజాద్ ఖాన్, పోసాని కృష్ణమురళి, అలీ, తదితరులు
ప్రొడక్షన్ కంట్రోలర్: బి.రవికుమార్,
ఆర్ట్: జానీ షేక్,
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ,
మ్యూజిక్: సునీల్‌కశ్యప్,
సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి,
నిర్మాతలు: సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి,
దర్శకత్వం: పూరి జగన్నాథ్
రిలీజ్ డేట్: 31వ మార్చి 2017
తెలుగు పరిశ్రమకు కొత్త హీరోయిజం ను పరిచయం చేసాడు పూరి. మహా మొండిగా, కొంచెం తిక్కగా ఉండే ఆ క్యారెక్టరైజేషన్ యూత్ కి పట్టేసింది. కథలో పెద్ద పాయింట్ లేకపోయినా పూరి తయారు చేసిన పాత్రలు ఆకట్టుకున్నాయి. ఇంకా చెప్పాలంటే అలా బిహేవ్ చేయడం యూత్ కి క్రేజ్ గా మారింది. అలాంటి పూరి మరో చంటిగాడిని పరిచయం చేస్తున్నాడు అంటే పూరి మార్క్ ప్రేమకథ పై ఆసక్తి పెరిగింది.. మరి ఈ చంటిగాడి కథేంటో చూద్దాం.
కథగా చెప్పుకుంటే:
అమ్మాయిలంటే చంటిగాడికి అసహ్యాం. అందులోనూ అంజలి అనే పేరుండే అమ్మాయింటే మరింత అసహ్యాం. ఎందుకంటే తనను ప్రేమించి మరొకర్ని బెటర్ మెంట్ కోసం పెళ్ళి చేసుకున్న తన ప్రేయిసి ఇచ్చిన ట్విస్ట్ కు రెండేళ్ళు జైలుకు వెళతాడు చంటి. తిరిగి వచ్చిన చంటికి తన ప్రేమకు బలైన కుటుంబానికి అండగా నిలుస్తాడు. చంటిగాడి సిన్సియారిటీ చూసి ఆ ఇంటి అమ్మాయి అంజలి (మన్నార్ చోప్రా) చంటితో ప్రేమలో పడుతుంది. జైలునుండి పారిపోయిన సైకో(అనూప్ ఠాకూర్) అంజలి కోసం వెతుకుంటాడు. ఆ ఇంటి బాద్యతను తీసుకున్న చంటి అంజలిని కాపాడేందకు సిద్దం అవుతాడు. అంజలి ప్రేమను చంటిగాడు అంగీకరిస్తాడా..? సైకో అంజలి పై ఎందుకు పగ అనేది మిగిలిన కథ..?
కథనం:
ఒక రోమాంటిక్ సాంగ్ తో సినిమా మొదలెట్టాడు పూరి జగన్నాథ్. నాప్రాణం అంటూ హీరో , హీరోయిన్లు మద్య కెమిస్ట్రీ చూసి పూరి ప్రేమకథ పై ఆసక్తి ని పెంచాయి. వెంటనే హీరోయిన్ ఇచ్చిన ఝలక్ తో అమ్మాయిలంటే విరక్తి పుట్టే హీరో క్యారెక్ట్రర్ ని బాగా డిజైన్ చేసాడు పూరి. ఇషాన్ లుక్ బాగుంది. డెబ్యూట్ ఫిల్మ్ అయినా ఆ ఛాయలు కనిపించకుండా చాలా కాన్పిడెంట్ గా కనిపించాడు. తన తొందరపాటుకు బలైన ప్యామిలీకి అండగా నిలవాలనే హీరో రోటీన్ ట్రాక్ పైకి వెంటనే తెచ్చేసాడు దర్శకుడు. ఆలీ కామెడీ కాస్త పర్లేదు, బెగ్గర్స్ ని అప్డేట్ చేసే కాన్సెప్ట్ తో నవ్వించాడు. పూరి మార్క్ డైలాగ్స్ కొన్ని చోట్ల మెరిసాయి. తన గాళ్ ప్రెండ్ ని బతిమిలాడుతున్న ఒక కుర్రాడితో హీరో ‘‘ దరిద్రం అలిగి వెళుతుంటే బతిమలాడమాకు ’’ అంటాడు. మార్వాడి క్యారెక్టర్ లో పోసాని బాగానే ఎంగేజ్ చేసాడు. తన కుటుంబం నుండి బయటకు వచ్చి తన వల్ల ఇబ్బంది పడిన వారికి అండగా నిలచే హీరో ఏమంత కొత్తగా అనిపించడు. అయితే హీరో కొత్తదనం ఏంటంటే తను చేస్తున్న మంచిని గురించి తనే చెప్పుకోవడం. ముఖ్యంగా ఆకుటుంబానికి బలవంతంగా బిర్యానీ పెట్టే సన్నివేశం లో పూరి పైత్యం తప్ప కనీసం నవ్వుకూడా రాదు. ఇలా కథ కదలకుండా సీన్స్ మాత్రం నడుస్తుంటాయి మద్యలో హీరో మాజీ లవర్ వచ్చి కాసేపు కామెడీ చేసి వెళుతుంది. అయితే హీరో ఒక విషయం పట్ల రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయితే తనెంత సిన్సియర్ గా ఉంటాడో అనే విషయం చెప్పడంలో పూరి తన స్టైల్ ని జోడించాడు. ఇక కథలోకి సైకో ఎంటరయ్యాక కథనం వేగం పెరుగుతుంది. హీరోయిన్ ఎందుకు టార్గెట్ చేసాడు అనే విషయంలో పూరి తీసుకున్న కారణం కూడా బాగా అలవాటయిన పాయింటే. అయితే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియని క్యారెక్టర్స్ ప్రేక్షకులకు బాగా పరిచయం అవడంతో సైకో చేష్టలు అంతగా ఆకట్టుకోవు. కథలో కొత్తదనం కోసం వెతకడం మానేసిన పూరి, క్యారెక్టర్స్ ని కొత్తగా అయినా డిజైన్ చేయలేకపోయాడు. సైకో క్యారెక్టర్ తో అంతగా ఎంగేజ్ కాకపోవడానికి కారణం కూడా అదే. ఇక హీరోయిన్స్ విషయంలో కూడా పూరి కాంప్రమైజ్ అయ్యాడనిపించింది. మన్నార్ చోప్రా సినిమాకి ,కథకు అసెట్ అవలేదు. ఇక సత్యదేవ్ తన పాత్రలో మెప్పించాడు. హీరోగా ఇషాన్ చాలా బాగా ప్రజెంట్ చేసాడు పూరి. పోరాటాలలో, ఎమోషనల్ సీన్స్ లో ఇషాన్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. పూరి రాసిన కథలో బలమైన రెండు క్యారెక్టర్స్ హీరో అండ్ విలన్. ఈ రెండు పాత్రల తీరు అలవాటయి ఉండటం సినిమాకి మైనస్ గా మారింది. సునీల్ క్యశప్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. నీలా ఎవరూ నాకు నచ్చలేదులే పాట చాలా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇషాన్ ని ప్రజెంట్ చేయడానికి అన్ని హాంగులున్న కథను తీసుకున్నాడు పూరి. కానీ అది చాలా సార్లు చూసిన కథే అన్న విషయం పట్టించుకోలేదు.కథల విషయంలో పూరి కి పెద్ద గా పట్టింపులు లేవనే విషయం రోగ్ కూడా ప్రూవ్ చేసాడు. కానీ క్యరెక్టర్స్ ని కూడా కొత్తగా చూపలేకపోయాడు. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇషాన్ క్యారెక్టరైజేషన్ కి ప్రేక్షకులు ఏంగేజ్ అవుతారు.
చివరిగా:
షోకేస్ ఫిల్మ్ ఫర్ ఇషాన్
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







