మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ను కలిశారు
- March 31, 2017
భారత పర్యటనలో ఉన్న మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ను కలిశారు. చెన్నైలోని పోయస్‌గార్డెన్‌లోని రజనీ నివాసంలో ఇరువురూ సమావేశమయ్యారు. దీనిపై రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘గతంలో సినిమా చిత్రీకరణ కోసం మలేసియా వెళ్లినప్పుడు ఆ దేశ ప్రధానిని కలవలేకపోయాను. అందుకే ఆయన భారత్‌లో ఉన్నారని తెలిసి ఇప్పుడు కలిశాను’ అని చెప్పారు. మలేసియాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని రజాక్ తనని కోరలేదని, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని రజనీ అన్నారు. అటు మలేసియా ప్రధాని కూడా రజనీకాంత్‌ను కలవాలని అధికారులను కోరినట్లు సమాచారం. .
ఐదు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా ప్రధాని రజాక్ గురువారం భారత్‌కు వచ్చారు.
తమిళనాడు సీఎం పళనిస్వామి, గవర్నర్ విద్యాసాగర్‌రావులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేడు ఆయన దిల్లీకి బయల్దేరనున్నారు.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







