మలేసియా ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ను కలిశారు

- March 31, 2017 , by Maagulf
మలేసియా ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ను కలిశారు

భారత పర్యటనలో ఉన్న మలేసియా ప్రధానమంత్రి నజీబ్‌ రజాక్‌ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్‌ను కలిశారు. చెన్నైలోని పోయస్‌గార్డెన్‌లోని రజనీ నివాసంలో ఇరువురూ సమావేశమయ్యారు. దీనిపై రజనీకాంత్‌ మాట్లాడుతూ.. ‘గతంలో సినిమా చిత్రీకరణ కోసం మలేసియా వెళ్లినప్పుడు ఆ దేశ ప్రధానిని కలవలేకపోయాను. అందుకే ఆయన భారత్‌లో ఉన్నారని తెలిసి ఇప్పుడు కలిశాను’ అని చెప్పారు. మలేసియాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండాలని రజాక్‌ తనని కోరలేదని, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని రజనీ అన్నారు. అటు మలేసియా ప్రధాని కూడా రజనీకాంత్‌ను కలవాలని అధికారులను కోరినట్లు సమాచారం. .
ఐదు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా ప్రధాని రజాక్‌ గురువారం భారత్‌కు వచ్చారు.
తమిళనాడు సీఎం పళనిస్వామి, గవర్నర్‌ విద్యాసాగర్‌రావులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేడు ఆయన దిల్లీకి బయల్దేరనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com