'జనతా గ్యారేజ్'కు అవార్డుల పంట
- March 31, 2017
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఫా(ఇంటర్నేషన్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డ్స్ 2017లో 'జనతా గ్యారేజ్' హంగామా చేసింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డ్స్‌ను తిరగరాయడంతో పాటు ఐఫా అవార్డ్స్‌లోనూ సత్తా చాటింది. పలు విభాగాల్లో ఈ సినిమా అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ హీరో, ఉత్తమ సినిమా, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డులతో పాటు మరికొన్ని అవార్డులను ఈ చిత్రం గెలుచుకుంది. మొత్తంగా ఈ సినిమా ఆరు అవార్డులను గెలుచుకుంది. ఐఫా 2017 విన్నర్స్ ఉత్తమ దర్శకుడు - కొరటాల శివ (జనతా గ్యారేజ్) ఉత్తమ సినిమా - జనతా గ్యారేజ్ ఉత్తమ నటుడు - జూనియర్ ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్) ఉత్తమ నటి - సమంత (అఆ) ఉత్తమ విలన్ - జగపతి బాబు (నాన్నకు ప్రేమతో) ఉత్తమ సహాయ నటుడు - అల్లు అర్జున్ (రుద్రమ దేవి) ఉత్తమ సహాయ నటి - అనుపమా పరమేశ్వరన్ (ప్రేమమ్) ఉత్తమ కమెడియన్ - ప్రియదర్శి (పెళ్లి చూపులు) ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్ (జనతా గ్యారేజ్) ఉత్తమ గాయకుడు - హరి చరణ్ (కృష్ణ గాడివీర ప్రేమగాధ) ఉత్తమ గాయని - గీతా మాధురి (జనతా గ్యారేజ్) ఉత్తమ పాటల రచయిత - రామజోగయ్య శాస్త్రి (జనతా గ్యారేజ్) ఉత్తమ క్యాస్ట్యూమ్స్ డిజైనర్ - అశ్విన్ వేల్ ( నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్) ఉత్తమ స్క్రీన్ ప్లే - అడవి శేషు (క్షణం) ఉత్తమ కథా రచయిత - క్రిష్ (కంచె) లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డు - కె.రాఘవేంద్రరావు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్







