కీరవాణి పై సిరాశ్రీ సంచలన విమర్శ
- March 31, 2017
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే.. వారికి ఉండే గౌరవ మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి.. ముఖ్యంగా కళాకారులు ఓ స్థాయి వస్తే...... తమ వాక్ లో మరింత మృధుత్వాన్ని పెంపొందించుకోవాలి.. మాట్లాడే మాటలు మరింత మధురంగా ఉండాలి.. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి బాహుబలి 2 పై ప్రస్తావిస్తూ.. ట్విట్స్ వర్షం కురిపించాడు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఉద్వేగంగా స్పందిస్తూ... బుర్ర లేని వారంటూ దర్శకులని.. వేటూరి-సీతారామశాస్త్రిల తర్వాత తెలుగు సాహిత్యం అంపశయ్య మీదికి చేరిందంటూ గేయ రచయితల్ని కించ పరిచేలా మాట్లాడారు. కీరవాణి మాటలపై ఇప్పటికే నెటిజన్స్ ఘాటుగా స్పందించారు.. మీ తప్పుల మాటేంటి.. మీరు కాపీ చేసిన పాటల మాటేంటి.. మీరు రిటైరైపోతే ఇండస్ట్రీకి వచ్చే నష్టమేంటి అంటూ చాలామంది కీరవాణి మీద విరుచుకుపడ్డారు. తాజాగా కీరవాణి చేసిన వ్యాఖ్యలపై కొందర గీత రచయితలు విమర్శలు చేస్తున్నారు.. భాస్కర భట్ల స్పందిస్తూ.. మీరు మీ సినిమాలకే కాకుండా మిగిలిన వారి సినిమాలకు కూడా పాటలు రాస్తే....... సినిమా సంగీతం అంపశయ్య మీదకు చేరదు అని సెటైర్స్ వేశారు.. ఇక రామ జోగయ్య శాస్త్రి ఐఫా అవార్డ్ అందుకొన్న తర్వాత మాట్లాడుతూ.. మంచి సందర్భం వస్తే ఏ రచయిత అయినా మెరుస్తాడని.. సందర్భం బాలేనపుడు సీతారామశాస్త్రి పాట కూడా పండదన్నారు.. తాజాగా కీరవాణి పై విమర్శకుల జాబితాలో లిరికిస్ట్ కమ్ క్రిటిక్ సిరాశ్రీ చేరారు.. కీరవాణి పాటల్లో సాహిత్యం ఎంత గా దెబ్బ తింటుంతో ఉదాహరణతో సహా వివరించాడు.. శ్రీరామదాసు సినిమాలో సాహిత్యం తో పాటు.. తాజాగా బాహుబలి 2 లో పాటల సాహిత్యం లోని తప్పులను ఎత్తి చూపారు.. "కీరవాణి అంపశయ్య" వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎద్దేవా చేశారు.. మరి ఇంకెంత మంది సాహిత్య కారులు కీరవాణి వ్యాఖ్యలపై స్పందిస్తారో చూడాలి మరి..
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







