సీనియర్ నటి రమాప్రభకు సన్మానం
- March 31, 2017
తెలుగు సినిమా సీనియర్ నటి రమాప్రభకు ఆత్మీయ పురస్కారం అందజేస్తున్నామని రాగమయి సాంస్కృతిక సినీ సంగీత సంస్థ గౌరవ అధ్యక్షుడు ఎంవీ రాజశేఖర్ తెలియజేశారు. ఈమేరకు డాబాగార్డెన్స్ ప్రేమసమాజం మినీహాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు తెలియజేశారు. మద్దిలపాలెంలోని కళాభారతిలో ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అంతేకాక సంస్థ అధ్యక్షురాలు కందర్ప రాధ సారథ్యంలో సంగీత విభావరి నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖలు హాజరవుతున్నారని చెప్పారు. కళాభిమానులు, సంగీత ప్రియులు కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







