ఎన్‌ఆర్‌ఐలకు మరో అవకాశం రద్దయిన నోట్లు జమపై జూన్ 30వ తేదీ వరకు
- March 31, 2017
రద్దయిన రూ.1000, రూ.500 నోట్లను మార్చుకోవడానికి ప్రవాస భారతీయు (ఎన్‌ఆర్‌ఐ)లకు మరో అవకాశం లభించింది. వారికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అయితే ఒకరు రూ.25 వేలకు మించి తీసుకురావడానికి వీల్లేదు. ఆ తరువాత గడువు పెంచే సూచనలు కూడా లేవు. వారు విమానాశ్రయంలో దిగేటప్పుడు కస్టమ్స్ అధికారులకు ఈ నోట్లను చూపించి సంబంధిత పత్రాలపై సంతకాలు చేయించాల్సి ఉంటుంది. అనంతరం రిజర్వు బ్యాంకులో నోట్లతో పాటు, వాటినీ సమర్పించాలి.
రిజర్వు బ్యాంకుల వద్ద భారీ వరుసలు: నోట్లు రద్దయిన సమయంలో విదేశాల్లో ఉన్నవారు వాటిని మార్చుకోవడానికి ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది.
చివరి రోజు కావడంతో రిజర్వు బ్యాంకుల వద్ద భారీ వరుసలు కనిపించాయి. దేశమంతటికీ కేవలం అయిదు...ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, నాగ్‌పూర్‌ల్లోని రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లోనే నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. తక్కువ సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేయడం, నిబంధనలపై తగిన అవగాహన లేకపోవడంతో చివరి రోజున బాగా రద్దీ కనిపించింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







