బహరేన్ లో గుండెపోటుతో మరణించిన భారతీయ ప్రవాసీయుడు

- April 01, 2017 , by Maagulf
బహరేన్ లో గుండెపోటుతో మరణించిన భారతీయ ప్రవాసీయుడు

బహరేన్ లో ఓ ప్రవాసీయ భారతీయుడు గుండెపోటుతో మరణించారు. కేరళా రాష్ట్రానికి     చెందిన థామస్ జాన్ (56) బటెల్కో సంస్థలో కొన్నాళ్ళు పాటు సేవలు అందించిన తర్వాత ఆయన స్వంతంగా ఖవాజా నియాజ్ నిర్మాణ కంపెనీని ప్రారంభించారు. దీనిని ఆయన  గత 35 సంవత్సరాలుగా ఎంతో  సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. థామస్ జాన్ కు భార్య రాచెల్ థామస్ మరియు ముగ్గురు కుమార్తెలు జేసింత్  థామస్, జస్సం థామస్ మరియు జానా థామస్ ఉన్నారు. థామస్ జాన్ పార్ధీవ దేహాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో మృతదేహాలను భద్రపరిచే ప్రదేశములో భద్రపర్చబడింది. సుగాయ లోని న్యూటెస్టమెంట్ చర్చి వద్ద  (నేడు) ఏప్రిల్ 1 వ తేదీ శనివారం సాయంత్రం 3 గంటలు 4 గంటల మధ్య ప్రార్ధనల అనంతరం ఆయనకు కడసారిగా నివాళులు అర్పించిన తర్వాత ఏప్రిల్ 3 వ తేదీ సోమవారం కేరళ లోని ఆయన స్వస్థలమైన కరునాగప్పల్లికు ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్ళతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com