టి20 ఫైనల్‌లో 'ఆక్వా పసిఫిక్ తాహా క్రికెట్ క్లబ్' గెలుపు
- September 28, 2015



2015 టెక్నోక్సెన్ అలయన్స్ టి20 కప్ ఆక్వా పసిఫిక్ తాహా క్రికెట్ క్లబ్ వశమైంది. స్ప్లెండిడ్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తాహా క్రికెట్ క్లబ్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ట్రోఫీతోపాటు 3000 అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్స్ నగదు బహుమతి విజేతను వరించింది. ఎంఈఏ కార్పొరేషన్‌కి చెందిన ఆక్వా పసిఫిక్ ఈ తాహా క్రికెట్ క్లబ్ జట్టును స్పాన్సర్ చేసింది. ఈ టోర్నీ జులై 24న ప్రారంభమై, సెప్టెంబర్ 11 వరకు జరిగింది. ఎనిమిది వారాల్లో 20 టీమ్‌లు, రెండు గ్రూపులుగా విడిపోయి పోటీ పడగా, మొత్తం 58 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటిదాకా తాహా క్రికెట్ క్లబ్ రెండు ట్రోఫీలను సొంతం చేసుకుంది. తాజా గెలుపు ఆ జట్టుకి మూడో విజయం. ఈ సంవత్సరం తమ విజయాల పరంపర అప్రతిహతంగా కొనసాగుతోందనీ, గెలవడానికి జట్టు సభ్యులంతా ఐక్యంగా ఎంతో కష్టపడుతున్నారని జట్టు కెప్టెన్ అసిఫ్ అక్తర్ చెప్పారు. 199 పరుగుల టార్గెట్‌ని కేవలం 13.1 ఓవర్లలోనే తాహా క్రికెట్ క్లబ్ జట్టు ఛేదించి, చిరసణ్రీయ విజయం అందుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ , బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ ఇమ్రాన్ మునీర్‌కి దక్కింది. మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ వహీద్ అమ్మద్‌కి దక్కింది.
టి20 ఫైనల్‌లో గెలుపొందిన జట్టు కి మాగల్ఫ్.కామ్ వారి అభినందనలు
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







