తెలుపు రకం వంకాయలను తింటే...

- April 01, 2017 , by Maagulf
తెలుపు రకం వంకాయలను తింటే...

వంకాయలు ఐదు రకాల వరకు వున్నాయి. ఇది అన్ని కాలాల్లోను లభ్యమయ్యే కూరగాయ. గుత్తి వంకాయ కూరంటే ఇష్టపడని వాళ్లెవరుంటారు? అయితే దీనితో కూరలేకాదు, పచ్చళ్లు, ఊరగాయలు కూడా చేసుకోవచ్చు. శాస్త్రీయ పరిశీలనల వలన ఇవి అతిగా వాడటం కూడా మంచిది కాదని తెలుస్తోంది. ఇవి కొంతమందికి ఎలర్జీ కలిగిస్తాయి. 
 
విటమిన్ ఎ విటమిన్ సి మాంసకృత్తులు, సున్నము, మెగ్నీషియమ్ భాస్వరమ్, ఖనిజములు, క్రొవ్వు మొదలగు పోషక పదార్థాలు వీటి నుంచి లభిస్తున్నాయి. తెలుపు రకం వంకాయలు అతి మూత్ర వ్యాధిగ్రస్తులకు ఔషధంగా పనిచేయడమే కాక వీర్యపుష్ఠిని కూడా యిస్తాయి. వంకాయే కాదు దాని మొక్క ఆకు రసం కూడా ఎన్నో వ్యాధుల నివారణలో ఉపయోగపడుతుందని తెలుస్తుంది. అందుకే ప్రాచీన కావ్యాలలో కూడా దీనికి విశిష్టస్థానం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com