ఉసిరి బజ్జీలు
- April 01, 2017
కావలసిన పదార్ధాలు: బంగాళాదుంపలు - నాలుగు, పచ్చిమిర్చి - ఐదు, నూనె - రెండు కప్పులు, ఉసిరి తురుము - నాలుగు కప్పులు, ఉప్పు - తగినంత, కరివేపాకు రెబ్బలు - రెండు, శనగపిండి - కప్పు, బియ్యప్పిండి - పావుకప్పు, జీలకర్ర - రెండు చెంచాలు, వాము - రెండు చెంచాలు, కారం - కొద్దిగా, వంటసోడా- అరచెంచా, ఆవాలు- చెంచా.
తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించి, పొట్టు తీసి పెట్టుకోవాలి. బాణలిలో రెండు చెంచాల నూనె వేడిచేసి ఆవాలూ, జీలకర్రా వేయించుకోవాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలూ, కరివేపాకు రెబ్బలూ వేసుకోవాలి. అవి వేగాక ఉసిరి తురుము వేయాలి. రెండు నిమిషాల తరువాత తగినంత ఉప్పూ, బంగాళాదుంపల ముద్దా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బుల్లెట్ ఆకృతిలో చేసుకుని పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శనగపిండీ, బియ్యప్పిండీ, వంటసోడా, వాము, కారం, కొద్దిగా ఉప్పూ వేసి, నీళ్ళతో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఉసిరి బుల్లెట్లను ఈ పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసుకుంటే సరి... నోరూరించే ఉసిరి బజ్జీలు సిద్ధం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







