నాని ఇదిగో తన కొడుకుతో

- April 01, 2017 , by Maagulf
నాని ఇదిగో తన  కొడుకుతో

యువ హీరో నాని ఇటీవల వరుస విజయాలతో దూసుకు పోతున్న విషయం తెల్సిందే. 'నేను లోకల్‌' చిత్రంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను అందుకున్న నాని తాజాగా మరో బిగ్‌ బహుమతిని భార్య అంజన ద్వారా నాని పొందాడు. కొన్ని సంవత్సరాల క్రితం నాని, అంజనలు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి ప్రేమ కథ చాలా కాలం నడిచింది. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి, ఆ తర్వాత ఒప్పించి నాని, అంజనలు వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.
తాజాగా వీరికి ఉగాది పండుగ దినాన పండంటి బాబు పుట్టాడు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌లో నాని భార్య అంజన బాబుకు జన్మనిచ్చింది. ఈ సందర్బంగా నానికి అభినందనలు తెగ వచ్చాయి.
నాని కొడుకు పుట్టి వారం రోజులు కూడా కాకుండానే అప్పుడే సోషల్‌ మీడియాలోకి వచ్చేశాడు. స్వయంగా నాని తన కొడుకు ఫొటోను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశాడు. తండ్రి అయిన సందర్బంగా నానికి మరోసారి హార్థిక శుభాకాంక్షలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com