పాకిస్థాన్లోని దారుణం 20 మందిని పొడిచి చంపారు
- April 02, 2017
మతిస్థిమితం లేని కొందరు వ్యక్తులు 20 మంది దారుణంగా పొడిచి చంపిన ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ప్రావిన్స్లో చోటుచేసుకుంది. స్థానిక సర్గోధా జిల్లాలో మహమ్మద్ అలీ గుజ్జర్ దర్గాలో అబ్దుల్ వహీద్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు సంరక్షకులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో అబ్దుల్ వహీద్కి మతిస్థిమితంలేదు. ఈ నేపథ్యంలో అబ్దుల్ మరో ఇద్దరు సహచరులతో కలిసి శనివారం దర్గాకి వచ్చిన భక్తుల్లో ముగ్గురు మహిళలతో పాటు 20 మందికి డ్రగ్స్ ఇచ్చారు. మత్తులో పడిపోయి ఉన్న వారందరి దుస్తులు విప్పేసి ఆ తర్వాత దారుణంగా పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు. .
వీరు ఈ అఘాయిత్యానికి ఎందుకు పాల్పడ్డారో తెలియలేదు.
కానీ వారు ముగ్గురూ గత రెండేళ్లుగా సర్గోధా జిల్లాలోని చుట్టు పక్క ప్రాంతాలకు వచ్చి పూజలు నిర్వహిస్తుండేవారని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దర్గాలో సంరక్షకులుగా పనిచేస్తున్న ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. దాడిలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. భక్తులు తమ పాపాలు కడిగేసుకోవడానికి ఈదర్గాకి వస్తుంటారు.
అంతేకాదు ఇక్కడి సంరక్షకుల చేత వాతలు పడేలా కొట్టించుకుంటారు కూడా. కానీ శనివారం వచ్చిన భక్తులకు ముందు డ్రగ్స్ ఇచ్చి వారి దుస్తులు విప్పేసి కత్తితో పొడిచి ఆ తర్వాత వారిని కొట్టారని అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత దర్గాను తాత్కాలికంగా మూసేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!
- ఫిబ్రవరి 1న దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగింపు..!!
- నాన్-సౌదీల నియామకాలపై ఖివా క్లారిటీ..!!
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం







