యువతీ మృతికి కారకుడైన జిసిసి వ్యక్తికి 200,000 క్యూ ఆర్ రక్త పరిహారం

- April 02, 2017 , by Maagulf
యువతీ మృతికి కారకుడైన  జిసిసి వ్యక్తికి  200,000 క్యూ ఆర్  రక్త పరిహారం

రోడ్డుపై దృష్టి నిలపక అడ్డదిడ్డంగా వాహనాలను నడిపేవారికి దోహా న్యాయస్థానం ఓ ఝలక్ ఇచ్చింది. నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి తన ముందు మరో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక యువతిని ఢీ కొట్టి ఆమె మరణానికి కారణమైన జీసీసీ వ్యక్తికి దోహా క్రిమినల్ న్యాయస్థానం10, 000 కతర్ రియాళ్ళు జరిమానా విధించి ఆ యువతీ కుటుంబానికి రక్త పరిహారం కింద మరో 200,000 కతర్ రియాళ్ళు చెల్లించాలని ఆదేశించింది.మరణించిన ఆ యువతీ సి లైన్ ఏరియాలో తన క్వాడ్ బైక్ మీద నెమ్మదిగా వెళుతుండగా...వెనుక నుండి నిర్లక్ష్యంగా మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న జీసీసీ వ్యక్తి ఆ యువతీ  క్వాడ్ బైక్ ను అత్యంత వేగంగా.' డీ '  కొట్టాడు. దీనితో ఆ యువతీ తన ద్విచక్ర వాహనం పై నుంచి గాలిలోనికి ఎగిరి మరో కారుని బలంగా తాకింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. ఈ కేసులో మరణించిన యువతీ యొక్క చట్టపరమైన వారసులకు  200, 000 కతర్ రియళ్ళ రక్తపరిహారం చెల్లించాలని ప్రతివాదికి గౌరవనీయ కోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com