హిందీలో యూఏఈ ఎం-ప్రభుత్వం ట్వీట్లు
- September 28, 2015
టెలికమ్యూనికేషన్ రంగంలో సంస్కరణలు చేపట్టడంలో భాగంగా జనరల్ అథారిటీ హిందీ భాషను అదనంగా జోడించనున్నది. యూఏఈ ఎం-ప్రభుత్వం, ట్విట్టర్లో సమాచారం కోసం హిందీ భాషను కూడా ఉపయోగించనుంది. ప్రజల ప్రయోజనార్ధం ఈ నిర్ణయం తీసుకుంది యూఏఈ ప్రభుత్వం. సేవలకు సంబంధించిన వివిధ అంశాలు ప్రజలకు ఇంకా ఉపయోగపడేందుకు హిందీ ఉపయోగపడుతుందని యూఏఈ ప్రభుత్వం భావిస్తోంది. యూఏఈ టీఆర్ఏ డైరెక్టర్ జనరల్ చెబుతూ, యూఏఈ ప్రభుత్వం తమ పౌరుల్ని గౌరవిస్తుందని, వారి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుంటుందనీ, వివిధ భాషల, సంస్కృతి వంటి వాటిని గమనిస్తూ, ప్రభుత్వంతో ప్రజలకు సరైన కమ్యూనికేషన్ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల ఆలోచనల్ని ప్రభుత్వం నేరుగా తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారాయన. సమాచారం పంపడం, దాన్నుంచి అభిప్రాయాల్ని తెలుసుకోవడం, ఆ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని తగు విధంగా వ్యవహరించడం అనే మూడు దశలు ఎం-గవర్నమెంట్ యొక్క లక్ష్యాలని టీఆర్ఏ డైరెక్టర్ జనరల్ చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







