ఎఫ్‌ఎన్‌సీ పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు
- September 28, 2015
2015 ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ ఎన్నికల కోసం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఓటర్లు బారులు తీరారు. తమ అనుచరులతో 60 మంది వరకూ దుబాయ్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ బాడీస్ ఇస్మాయిల్ అల్బన్న అల్ బస్తకి సోమవారం పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నవారిలో ఒకరు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఓటర్లు నేరుగా ఓటు వేయడానికి వెళుతున్నారనీ, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తడంలేదని ఆయన అన్నారు. ఓటర్లు అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులను గెలిపించాలనుకుంటారని ఓటు వేసేందుకు వచ్చిన పలువురు అభిప్రాయపడ్డారు. తండ్రి కాబట్టి ఆయనకే ఓటు వేయాలనుకోవడం కన్నా, ఆయన చేసిన అభివృద్ధి పనుల్ని చూసి ఓటేయాలని వచ్చినట్లు ఓ అభ్యర్థి కుమారుడు చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







