కేరళ వలస కార్మికులకు ఆరోగ్య భీమా తప్పనిసరి
- September 28, 2015
కేరళ నుంచి విదేశాలకు వెళ్ళాలనుకునేవారికి ఆరోగ్య భీమా తప్పనిసరి కానుంది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారతదేశం నుంచి అధికారికంగా ఇప్పటివరకు ఇలాంటి 'తప్పనిసరి' నిబంధన లేదు. కేరళ ప్రభుత్వం ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తే, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఈ విభాగంలో కేరళ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. విదేశాల్లో ఉంటున్న కార్మికులు ఈ అంశంపై చర్చిస్తున్నారు. కేరళ ప్రభుత్వం కూడా వారితో చర్చలు జరుపుతోంది. భీమా ప్రీమియం ఎలా ఉండాలి? ఎంతవరకు అది అత్యవసరం? అనే అంశాలను చర్చిస్తున్నట్లు నాన్ రెసిడెంట్ కేరళైట్స్ డిపార్ట్‌మెంట్ (నోర్కా) సెక్రెటరీ రాణి జార్జ్ చెప్పారు. ఫిలిప్పీన్ దేశంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి నిబంధన అమల్లో ఉంది. 2014 అంచనాల ప్రకారం 2.3 మిలియన్ రేరళీయులు విదేశాల్లో ఉంటున్నారు. వారిలో ఎక్కువమంది గల్ప్ దేశాల్లోనే ఉపాధి పొందుతున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







