మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నఅబుధాబి యువరాజు
- April 02, 2017
అబుధాబి యువరాజు మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు.యు.ఏ.ఈలోని ఫుజైరః అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబంపై ఒక వ్యక్తి హత్య ప్రయత్నం చేశాడు. ఆ దాడిలో ఇంటి యజమానురాలు అక్కడిక్కడే చనిపోయింది. వారింట్లో పనిచేస్తున్నా పనిమనిషితో సహ పిల్లలద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్మార్గం నుంచి గాయాలతో బయటపడ్డ పిల్లలిద్దరిని, పనిమనిషిని రాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ పరామర్శించారు. వారు షేక్ ఖలీఫా మెడికల్ సీటీ హస్పటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ఎటువంటి చికిత్స అందిస్తున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో రాజు సామాన్య బాధితులను పరామర్శించడం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సామాన్యుల పట్ల ఆయన చూపుతున్న ఆదరణను పలువురు కొనియాడారు.
తాజా వార్తలు
- Dubai Press Club launches new phase of ‘Dubai Content Creators Programme’
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి







