రేసింగ్‌ సీజన్‌కి సమాయత్తమైన బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌

- April 03, 2017 , by Maagulf
రేసింగ్‌ సీజన్‌కి సమాయత్తమైన బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌

మనామా: బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (బిఐఎ), ఈ ఏడాది ఫార్ములా వన్‌ గల్ఫ్‌ ఎయిర్‌ బహ్రెయిన్‌ గ్రాండ్‌ పిక్స్‌ కోసం వచ్చే అంతర్జాతీయ అతిథులకోసం సర్వసన్నద్ధమయ్యింది. ఏప్రిల్‌ 14 నుంచి 16 వరకు ఈ గ్రాండ్‌ ప్రిక్స్‌ జరగనుంది. ప్రయాణీకులు, కార్గో మూమెంట్‌ని రద్దీకి అనుగుణంగా అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ వెల్లడించింది. పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు వస్తారని తాము అంచనా వేశామని బిఎసి అధికారులు తెలిపారు. బిఎసి చీఫ్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ మైఖేల్‌ హోహాెన్‌బెర్గర్‌ మాట్లాడుతూ, ఎఫ్‌1 రేస్‌ నేపథ్యంలో 10,000 నుంచి 14,000 మంది ప్రయాణీకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈవెంట్‌ని విజయవంతం చేయడం కోసం తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com