అరశాతం వడ్డీ రెట్లు తగ్గించిన 'ఆర్ బి ఐ'..!
- September 28, 2015
నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి, విధాన సమీక్షను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్రాజన్ వెల్లడించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామ్రాజన్ మాట్లాడుతూ... కీలక వడ్డీరేట్లను అరశాతం మేర తగ్గించినట్లు ప్రకటించారు. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తి యథాతథంగా ఉంటుందని ప్రకటించింది. దీంతో రెపో రేటు నాలుగేళ్ల కనిష్ఠస్థాయి 6.75శాతానికి చేరింది. వర్షాభావ పరిస్థితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందని, 2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణం 5.8 శాతం ఉటుందని ఆర్బీఐ అంచానవేస్తున్నట్లు రాజన్ చెప్పారు. 2015-16లో వృద్ధిరేటు అంచనాను 7.6శాతం నుంచి 7.4శాతానికి తగ్గించనిట్లు పేర్కొన్నారు. 2018 మార్చి నాటికి ప్రభుత్వ బాండ్లలో ఎఫ్సీఐ పెట్టుబడి పరిమితిని దశలవారీగా 5 శాతానికి పెంచుతామని రాజన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







