దసరా కానుకగా యన్టీఆర్ కొత్త చిత్రం!

- September 28, 2015 , by Maagulf
దసరా కానుకగా యన్టీఆర్ కొత్త చిత్రం!

టాలీవుడ్ యంగ్ టైగర్ యన్టీఆర్ స్పీడ్ పెంచాడు. సినిమాల పై సినిమాలకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చి నందమూరి అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం తను నటిస్తున్న నాన్నకు ప్రేమతో ఇంకా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నాన్నకు ప్రేమతో అనే సాఫ్ట్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు మాస్ హీరో యన్టీఆర్. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే అప్పుడే యన్టీఆర్ మరో ప్రాజెక్ట్ లో నటించేందుకు సన్నాహాలు మొదలు పెట్టాడు. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన మైత్రి మూవీ బ్యానర్ పై యన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని డీల్ చేయబోతున్నాడు. దసరా సందర్భంగా అక్టోబర్ 22న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లుగా మైతి మూవీస్ యూనిట్ సృష్టం చేసింది. మైత్రి మూవీస్ తో యన్టీఆర్ సినిమా ముచ్చట్లు కాసేపు పక్కనపెడితే. యన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ యూరప్ లో జరిగింది. గత 50 రోజుల నుంచి లండన్ ప్రయత్నిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com