భారత్ పెట్టుబడులు మలేషియాలో
- April 03, 2017
రూ.2.34 లక్షల కోట్ల ఒప్పందాలపై సంతకాలు
నిర్మాణ, ఫార్మా, విద్యా రంగాల్లో సహకారంపై భారత్, మలేషియా దేశాలు 31 ఒప్పందాలపై సోమవారం సంతకాలు చేశా యి. ఈ ఒప్పందాల విలువ 3,600 కోట్ల డాలర్లు (రూ.2.36 లక్షల కోట్లు). భారత పర్యటనలో ఉన్న మలేషియా ప్రధాని మహమ్మద్ నజీబ్ తున్ అబ్దుల్ రజాక్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో నాట్కో ఫార్మా, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ర్టిబ్యూషన్ కార్పొరేషన్, జిఎంఆర్ ఎనర్జీ ఉన్నాయి. ఇవి కాకుం డా అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్లు, అదానీ రియాల్టీ, విబిసి ఫెర్టిలైజర్స్, ఎన్‌బిసిసి, జైప్రకాష్ అసోసియేట్స్, ముంబై డబ్బావాలా సంఘం కూడా ఉన్నాయి.
ఇంత భారీ వాణిజ్య అవకాశం గల ఒప్పందాలపై సంతకాలు జరగడం ఉభయ దేశాల వ్యాపారవర్గాల్లో గల పరస్పర విశ్వాసానికి, సానుకూల భావాలు, సెంటిమెంట్లకు నిదర్శనమని నజీబ్ ఆ తర్వాత ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. భారతలో ఆరు రోజుల పర్యటనలో ఉన్న నజీబ్ సోమవారం ప్రధాని నరేంద్రమోదీని కలిసి ఉభయ దేశాలకు ఆసక్తి కలిగిన పలు అంశాలపై చర్చించారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) ఒప్పందాన్ని సత్వరం పూర్తి చేయాలని నజీబ్ ఈ సందర్భంగా కోరారు. భారత్, చైనా, జపాన్, ఆస్ర్టేలియాతో సహా 16 దేశాల ఆర్థిక సహకార కూటమికి వీలు కల్పించే ఆర్‌సిఇపిపై సత్వరం చర్చలు ముగిం చి వచ్చే ఏడాది ప్రారంభానికి సంతకాలు చేయడానికి మార్గం సుగమం చేయాలని ఈ అంశంపై చర్చలు జరుపుతున్న ప్రతినిధులకు సూచించాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







