ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో
- April 03, 2017
బరోడా-మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో తొమ్మిది నెలల ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్’ కోర్సులో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఈ కోర్సు పూర్తి చేసిన వారిని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ (జేఎంజీ)/స్కేల్-1 ప్రొబెషనరీ ఆఫీసర్ (పీవో) గా నియమిస్తారు. పీవోగా చేరిన తరువాత మొదటి మూడు నెలలు ఉద్యోగ శిక్షణ పొందాలి.
ఖాళీలు: ఓసీ-202, ఓబీసీ-108, ఎస్సీ-60, ఎస్టీ-30.
విద్యార్హత : 2017 మే నాటికి కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది.
వయస్సు: 2017, ఏప్రిల్ 1 నాటికి కనీసం 20 ఏళ్ళు, గరిష్టం 28 ఏళ్ళు. రిజర్వేషన్ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:ఆన్‌లైన్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : మే 1, 2017
రాత పరీక్ష తేదీ: మే 27, 2017. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







