క్రికెట్‌ ఆడనున్న ఎంపీలు ముంబయి తారలతో

- April 03, 2017 , by Maagulf
క్రికెట్‌ ఆడనున్న ఎంపీలు ముంబయి తారలతో

ముంబయి తారలతో పార్లమెంట్‌ సభ్యులు క్రికెట్‌ ఆడనున్నారు. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ మైదానం దీనికి వేదిక కానుంది. ముంబయి హీరోస్‌ జట్టుకు బాబీ డియోల్‌ సారథ్యం వహిస్తుండగా, ఎంపీస్‌ ఎలెవన్‌ జట్టుకు లోక్‌సభ సభ్యుడు అనురాగ్‌ ఠాగూర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
2025నాటికి దేశం నుంచి టీబీని తరిమికొట్టాలన్న లక్ష్యంపై అవగాహన కోసమే ఈ మ్యాచ్‌ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 8న ఇరు జట్ల మధ్య ఏకైక టీ20 మ్యాచ్‌ నిర్వహించినట్లు చెప్పారు. అంతేకాదు ప్రజలకు టీబీపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్‌ 7, 8న ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.
క్షయ వ్యాధి నిపుణులు, శాస్త్రవేత్తలు, రోగులు, వైద్యులు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని క్షయవ్యాధి నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు.
2025 నాటికి భారత్‌లో టీబీని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాధికారులు సెలబ్రెటీల ద్వారానే వీలైనంత త్వరగా ప్రజల్లో అవగాహన కల్పించగలమని తెలిపారు. అందుకోసమే ఎంపీలతో చర్చించి ఈ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, అనురాగ్‌ ఠాగూర్‌తో పాటు మనోజ్‌తివారి, రాజీవ్‌ శుక్లా, బాబుల్‌ సుప్రియో, నిషికాంత్‌ దుబే తదితరులు ఎంపీస్‌ ఎలెవన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. సునీల్‌ శెట్టి, సోనూ సూద్‌, సొహైల్‌ ఖాన్‌, జిమ్మి షెర్గిల్‌, విక్కి చోప్రా, ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, వరుణ్‌ బదోలా తదితరులు ముంబయి హీరోస్‌ జట్టులో కలిసి ఎంపీలతో తలపడనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com