సాయం చేయమంటూ కోరిన ట్వీటుకు స్పందించిన ఎంపీ కవిత

- April 04, 2017 , by Maagulf
సాయం చేయమంటూ కోరిన ట్వీటుకు స్పందించిన ఎంపీ కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు ఓ యువకుడు ఆదుకోమంటూ ట్వీట్ చేశాడు.  వివరాల్లోకి వెళితే 2014లో బతుకమ్మ పండుగ సందర్భంగా పూల కోసమని వెళ్ళి విద్యుత్ షాక్ తగిలి రెండు కాళ్ళు పోయాయి.  ఆర్థిక సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కి దరఖాస్తు చేసుకున్నాడు. ట్రీట్‌మెంట్ కోసం ఇప్పటివరకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు.  ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన శేఖర్ తనకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వికలాంగుల కోటాలో ఇప్పించగలరని మనవి చేసుకున్నాడు.  కానీ ఇంతవరకూ ఎటువంటి సాయం అందలేదు.  తక్షణమే స్పందించిన కవిత వివరాలు పంపమంటూ రీట్వీట్ చేశారు. ఆదుకుంటానని భరోసానిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com