భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్..!!
- September 29, 2015
ఈ-కామర్స్ దిగ్గజం బిగ్ బిలియన్ సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ఈ సందర్భంగా 70కి పైగా కేటగిరీల్లో లక్షలాది ఉత్పత్తులపై కంపెనీ అద్భుతమైన ఆఫర్లు, భారీ స్థాయిలో డిస్కౌంట్లు కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. అప్లికేషన్ ద్వారా మాత్రమే వినియోగదారులు ఈ ఆఫర్లను పొందవచ్చు. గత యేడాది కూడా ఇదే తరహాలో బిగ్ బిలియన్ సేల్‌ను నిర్వహించింది కూడా. దసరా పండగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కస్టమర్లు వివిధ రకాల బహుమతులు, ఉత్పత్తులు తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం బిగ్ బిలియన్ సేల్ ద్వారా కొనుగోలు చేయవచ్చని ఆ కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో మింత్రా కూడా భాగంగా ఉంటుందని, దీని ద్వారా వివిధ రకాల ఫ్యాషన్ బ్రాండ్లపై ఆఫర్లు ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







