అంబరాన్ని తాకనున్న అమరావతి శంకుస్థాపన సంబరాలు...!!
- September 29, 2015
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి శంకుస్థాపన అంగరంగ వైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో ప్రతి గ్రామం నుంచీ కలశాల్లో మట్టి సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. దసరా ఉత్సవాల్ని, శంకుస్థాపన వేడుకలను సమ్మిళతం చేసి రాష్ట్ర ప్రజలంతా భాగస్వాములయ్యేలా కార్యక్రమాలు రూపొందిస్తోంది. దసరా వేడుకల సందర్భంగా ప్రతి జిల్లాలోనూ రాజధాని నిర్మాణాన్ని ప్రతిబింభించే కార్యక్రమాలు నిర్వహించాలన్న అభిప్రాయంతో ఉంది. అమరావతి నిర్మాణానికి విజయదశమి రోజునే శంకుస్థాపన జరుగుతున్నందున ఈ వేడుక చిరస్మరణీయం చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. శంకుస్థాపన కార్యక్రమానికి దేశ, విదేశాల్లోని ప్రవాసాంధ్రుల్ని ఆహ్వానించనుంది. అలాగే, అన్ని రాష్ట్రాల నుంచి ప్రముఖులను ఆహ్వానించనుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









