వైరల్‌గా మారిన సూపర్‌మూన్‌ ఫోటో

- September 29, 2015 , by Maagulf
వైరల్‌గా మారిన సూపర్‌మూన్‌ ఫోటో

ముట్రా కోర్నిక్‌లోని పర్వతాల నడుమ సూపర్‌ మూన్‌ను మస్కట్‌కి చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ అత్యద్భుతంగా చిత్రీకరించాడు. సూపర్‌ మూన్‌ అంటే, చంద్రుడు భూమికి దగ్గరగా రావడం. ఈ సమయంలో అత్యంత ప్రకాశవంతంగా, అత్యంత బిగ్గరగా కూడా చంద్రుడు కనిపిస్తాడు. హుస్సేన్‌ అల్‌ భరణి అనే ఓ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ ఈ ఫొటోని తన కెమెరాలో బంధించాడు. సోమవారం ఉదయం 5.30 నిమిషాల సమయంలో సంభవించిన చంద్రగ్రహణానికి సంబంధించిన వివిధ దశలు కూడా హుస్సేన్‌ కెమెరాలో బంధింపబడ్డాయి. ఫొటోగ్రఫీ తనకు ఎంతో ఇష్టమనీ, అరుదైన ఈ దృశ్యాన్ని చిత్రీకరించడానికి ఎంతో కష్టపడ్డానని అన్నారు హుస్సేన్‌. మరో పద్ధెనిమిదేళ్ళ తర్వాత మాత్రమే సూపర్‌మూన్‌, చంద్రగ్రహణం ఒకేసారి సంభవిస్తాయి గనుక, ఈలోగా అందివచ్చిన అవకాశాన్ని హుస్సేన్‌ సద్వినియోగం చేసుకోవడాన్ని అందరూ అభినందిస్తున్నారు. సూర్యుడి ద్వారా వచ్చే వెలుగు చంద్రుడిని చేరకుండా భూమి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయానికి కాస్త ముందు చంద్రుడు ఓ మోస్తరు ఎరుపు రంగును సంతరించుకుంటాడు. గ్రహణం తర్వాత కూడా కాస్సేపు ఎరుపు రంగులో చంద్రుడు కనిపిస్తాడు. 

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com