వైరల్‌గా మారిన సూపర్‌మూన్ ఫోటో
- September 29, 2015
ముట్రా కోర్నిక్లోని పర్వతాల నడుమ సూపర్ మూన్‌ను మస్కట్‌కి చెందిన ఓ ఫొటోగ్రాఫర్ అత్యద్భుతంగా చిత్రీకరించాడు. సూపర్ మూన్ అంటే, చంద్రుడు భూమికి దగ్గరగా రావడం. ఈ సమయంలో అత్యంత ప్రకాశవంతంగా, అత్యంత బిగ్గరగా కూడా చంద్రుడు కనిపిస్తాడు. హుస్సేన్ అల్ భరణి అనే ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటోని తన కెమెరాలో బంధించాడు. సోమవారం ఉదయం 5.30 నిమిషాల సమయంలో సంభవించిన చంద్రగ్రహణానికి సంబంధించిన వివిధ దశలు కూడా హుస్సేన్ కెమెరాలో బంధింపబడ్డాయి. ఫొటోగ్రఫీ తనకు ఎంతో ఇష్టమనీ, అరుదైన ఈ దృశ్యాన్ని చిత్రీకరించడానికి ఎంతో కష్టపడ్డానని అన్నారు హుస్సేన్. మరో పద్ధెనిమిదేళ్ళ తర్వాత మాత్రమే సూపర్‌మూన్, చంద్రగ్రహణం ఒకేసారి సంభవిస్తాయి గనుక, ఈలోగా అందివచ్చిన అవకాశాన్ని హుస్సేన్ సద్వినియోగం చేసుకోవడాన్ని అందరూ అభినందిస్తున్నారు. సూర్యుడి ద్వారా వచ్చే వెలుగు చంద్రుడిని చేరకుండా భూమి మధ్యలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయానికి కాస్త ముందు చంద్రుడు ఓ మోస్తరు ఎరుపు రంగును సంతరించుకుంటాడు. గ్రహణం తర్వాత కూడా కాస్సేపు ఎరుపు రంగులో చంద్రుడు కనిపిస్తాడు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









