ఇజ్రాయిల్ తో భారత్ భారీ ఒప్పందం
- April 07, 2017
ఇజ్రాయిల్ భారత్‌తో 2 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌కి ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన నేవీ, ఆర్మీ క్షిపణులను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం చేసుకొన్నట్లు ఐఏఐ(ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్) గురువారం వెల్లడించింది. ఇజ్రాయిల్ చరిత్రలో ఇంతటి భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ 2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఐఏఐ వాటా 1.6 బిలియన్ డాలర్లు. మిగతా మొత్తం మరో దేశానికి చెందిన రాఫెల్ కంపెనీ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా ఇజ్రాయిల్ బరాక్ 8 (మీడియం రేంజ్ క్షిపణి), లాంగ్ రేంజ్ క్షిపణులను భారత్‌కు సరఫరా చేయనుంది. బరాక్ 8 క్షిపణులు 50 నుంచి 70 కి.మీ.ల వరకు డ్రోన్లను, వైమానిక దాడులను తిప్పికొట్టగలదు. ఈ ఒప్పందాన్ని బట్టి చూస్తే ఐఏఐ ఆధునిక టెక్నాలజీపై, సామర్థ్యాలపై భారత ప్రభుత్వానికి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోందని ఐఏఐ సీఈవో జోసెఫ్ వీస్ మీడియా ద్వారా తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







