సిరియా ఎయిర్ బేస్ పై అమెరికా దాడి, 9 మంది మృతి
- April 07, 2017
తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియాపై అమెరికా చేపట్టిన క్షిపణి దాడుల్లో 9 మంది మృతిచెందారు. సెంట్రల్ సిరియాలోని ఎయిర్‌బేస్‌పై చేసిన దాడుల్లో నలుగురు చిన్నారులు సహా 9 మంది పౌరులు మృతిచెందినట్లు సిరియా మీడియా వెల్లడించింది. సిరియాలోని తిరుగుబాటుదారులు అధికంగా ఉండే ప్రాంతాలపై అమెరికా క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. మధ్యధరా సముద్రంలోని యుద్ధనౌక నుంచి 59 తోమహౌక్ క్షిపణులను అమెరికా ప్రయోగించింది. సిరియాలో ఇటీవల జరిగిన రసాయన దాడులకు వ్యతిరేకంగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. సిరియాలో ఇటీవల రసాయన దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారులు సహా 70మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్‌లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







