ఖతార్ ఎయిర్ వేస్‌లో ల్యాప్‌టాప్ సౌకర్యం
- April 08, 2017
ఖతార్ ఎయిర్‌వేస్, యునైటెడ్ స్టేట్స్‌కి వెళ్ళే విమానాల్లో ఆన్ బోర్డ్ వర్క్ చేసుకోవడానికి వీలుగా ల్యాప్‌టాప్‌లను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాంప్లిమెంటరీ ల్యాప్‌టాప్‌లు ఫస్ట్ మరియు బిజినెస్ క్లాస్ ప్యాసింజర్లకు లభిస్తాయనీ, వీటిని బోర్డింగ్ గేట్ వద్ద ప్రయాణీకులు కలెక్ట్ చేసుకోవచ్చని ఖతార్ ఎయిర్ వేస్ వర్గాలు తెలిపాయి. ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో వర్క్ చేసుకోవడం ఎంత అవసరమో తాము గుర్తించామనీ, అందుకే ఈ ఆన్ బోర్డ్ ల్యాప్ టాప్ సౌకర్యం కల్పిస్తున్నామని ఖతార్ ఎయిర్ వేస్ గ్రూప్ సిఇఓ అక్బర్ అల్ బకర్ చెప్పారు. మార్చి నెలలో యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) అధ్యక్షుడు, ఆన్‌బోర్డ్ ల్యాప్ టాప్‌లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ ఫోన్లకు మించి ఎలాంటి గ్యాడ్జెట్స్‌నీ ఆన్‌బోర్డ్ అనుమతివ్వడంలేదు. 10 దేశాలకు చెందిన ఎయిర్‌పోర్ట్‌ల నుంచి (యూఏఈ, ఖతార్, ఈజిప్ట్, సౌదీ అరేబియా మరియు కువైట్ తదితర దేశాలు) వచ్చే విమానాలపై ఈ నిషేధం ఉంది. ఇంకో వైపున ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఉచిత వైఫై మరియు ఐపాడ్స్ సర్వీస్‌లను ఫస్ట్ మరియు బిజినెస్ క్లాస్ ప్యాసింజర్లకు ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు









