స్వీడన్ పై ఉగ్ర ‘ట్రక్కు’ బీభత్స దాడిని ఖండించిన కతర్
- April 08, 2017
దోహా: స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో శుక్రవారం జరిగిన ఓ ఉగ్ర ‘ట్రక్కు’ బీభత్సంపై కతర్ రాజ్యం గట్టిగా ఖండించింది. సెంట్రల్ స్టాక్‌హోంలో అత్యంత రద్దీగా ఉండే ఓ డిపార్ట్మెంటల్ స్టోర్‌లోకి శుక్రవారం ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్వీడన్‌పై జరిగిన ఉగ్రవాదుల దాడి అని ఆ దేశ ప్రధాని స్టెఫాన్ లోఫెన్ స్పష్టం చేశారు. ఈ దాడికి సంబంధించి ఒకరిని అరెస్టు చేశామని ప్రకటించారు. ట్రక్ దూసుకుపోయిన సమయంలో ఎవరు కాల్పులు జరిపారనే విషయంపై ఇంకా స్పష్టతలేదని పోలీసువర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్న పోలీసులు అనుమానితుల కోసం జల్లెడపడుతున్నారు. 2010లో జరిగిన ఆత్మాహుతి దాడి ప్రదేశానికి సమీపంలోనే తాజా దాడి చోటు చేసుకోవడం గమనార్హం. కాగా, ఈ దాడి ఘటనపై కతర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. స్వీడన్ ప్రజలకు కతర్ మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి అన్ని క్రిమినల్ దాడులకు కతర్ పూర్తిగా వ్యతిరేకమని హింసాకాండ మరియు తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంబంధించిన అన్ని రకాల విధానాలకు కతర్ మద్దతు ఇస్తుందని వాటికి ప్రధాన స్థానం ఉంటుందని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటన లో కతర్ తెలిపింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









