వ్యాయామం చేసిన తరువాత పోషకాహారం తప్పక తీసుకోవాలి
- April 08, 2017
వ్యాయామం చేయడం ద్వారా ఆయుష్షు పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే వ్యాయామం మొదలు పెట్టాక దానిని ఆపకూడదని.. క్రమంగా చేస్తూనే వుండాలని వైద్యులు చెప్తున్నారు. వ్యాయామం చేయడం ద్వారా కండరాల పనితీరు మెరుగవడంతో పాటు అధిక బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చునని.. అయితే అదే పనిగా వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకోకపోతే మాత్రం శరీరంలోని శక్తి నశిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా లో ఎనర్జీ అవైలబిలిటీ అనేది తరచూ వ్యాయామం చేసే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. అందుకే వ్యాయామం ద్వారా భారీగా శక్తిని కోల్పోకుండా వుండాలంటే... ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
లేకుంటే నిస్సత్తువ, దీర్ఘకాలంలో రుతుక్రమంలో ఇబ్బందులు, ఎముకల బలహీనత, కొలెస్ట్రాల్‌లో మార్పులు ఏర్పడతాయి. అందుకే వ్యాయామం తర్వాత మాంసకృత్తులు అందించే కోడిగుడ్లు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలు, పాలు, చికెన్, గోధుమలతో చేసిన వంటకాలు, బాదం, డ్రైఫ్రూట్స్, నట్స్ వంటివి తీసుకోవాలని న్యూట్రీషన్లు చెప్తున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







