అక్షయ్‌కుమార్, సోనమ్ కపూర్ ల కు అవార్డుల పంట
- April 08, 2017
అక్షయ్‌కుమార్, సోనమ్ కపూర్.. ఇద్దరూ జాతీయ అవార్డ్స్ అందుకున్నవారే. అక్షయ్ 'రుస్తుం' చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా చేసిన అద్భుత నటనకు.. 'నీర్జా' చిత్రంలో ఎయిర్ హోస్టెస్‌గా సోనమ్ చేసిన టెరిఫిక్ పర్ఫార్మెన్స్‌కూ జాతీయ అవార్డులు వరించాయి. అక్షయ్, సోనమ్ నటించిన ఈ రెండు చిత్రాలు బయోపిక్‌లే. ఇద్దరూ సినిమా ఆసాంతం యూనిఫామ్‌లో కనిపిస్తారు. ఇది ఓ ఎత్తయితే, మరో ఆశ్చర్యమేంటంటే.. వీరిద్దరూ 'ప్యాడ్‌మాన్' షూటింగ్‌లో ఉండగా నేషనల్ అవార్డ్స్ రావటం. దీంతోపాటు జాతీయ అవార్డు అందుకోవటం ఇద్దరికీ తొలిసారే. ఈ నటుల పేర్లలో చివరి అక్షరం 'ఆర్'. మొత్తానికి ఇలా ఈ జాతీయ అవార్డుల గ్రహీతల మధ్య అనుకోని సారూప్యతలు ఇన్ని ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. జాతీయ అవార్డ్స్ ప్రకటించిన వెంటనే ఈ హీరో, హీరోయిన్ 'ఆశ్చర్యంగా ఫీలయ్యేట్లు' సెట్‌లో ఓ ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటోని సోనమ్‌కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'షాక్డ్ అండ్ గ్రేట్‌ఫుల్' అంటూ కామెంట్ చేసింది.
ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









