గాయాల్ని లెక్కచేయం: భారతీయ కార్మికులు

- April 10, 2017 , by Maagulf
గాయాల్ని లెక్కచేయం: భారతీయ కార్మికులు

జెడ్డా:హౌతి మిలిటెంట్లు పేల్చిన షెల్‌ కారణంగా ఓ భారతీయ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు భారతీయ కార్మికులు గాయాలపాలయ్యారు. అయితే కోలుకున్న తర్వాత తిరిగి అదే ప్రాంతంలో పనిచేయడానికి తాము వెనుకాడబోమని వారు చెప్పారు. సివిల్‌ డిఫెన్స్‌ డిప్యూటీ అధికార ప్రతినిథి కెప్టెన్‌ అబ్దుల్లా సయీద్‌ మాట్లాడుతూ, యెమెనీ బోర్డర్‌ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయనీ, ఈ దాడుల్లో ఓ ఇండియన్‌ వర్కర్‌ చనిపోగా, మరో ముగ్గురు ఇండియన్స్‌ గాయపడ్డారనీ, వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం షాప్‌ని ప్రారంభించిన కాస్సేపటికే ఈ దాడి జరిగింది. మృతుడ్ని ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కడప జిల్లా వాసి ఎ.వెంకటసుబ్బారెడ్డిగా గుర్తించారు. ఎనిమిది నెలల క్రితమే ఈయన కింగ్‌డమ్‌కి పని నిమిత్తం వచ్చారు. గాయపడ్డవారిలో అజాంగర్‌ ఉత్తరప్రదేశ్‌కి చెందిన సంతోష్‌కుమార్‌, కడపకి చెందిన ఓబులేష్‌, తెలంగాణలోని జగిత్యాలకు చెందిన కమలాకర్‌రావు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com