గాయాల్ని లెక్కచేయం: భారతీయ కార్మికులు
- April 10, 2017
జెడ్డా:హౌతి మిలిటెంట్లు పేల్చిన షెల్ కారణంగా ఓ భారతీయ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు భారతీయ కార్మికులు గాయాలపాలయ్యారు. అయితే కోలుకున్న తర్వాత తిరిగి అదే ప్రాంతంలో పనిచేయడానికి తాము వెనుకాడబోమని వారు చెప్పారు. సివిల్ డిఫెన్స్ డిప్యూటీ అధికార ప్రతినిథి కెప్టెన్ అబ్దుల్లా సయీద్ మాట్లాడుతూ, యెమెనీ బోర్డర్ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయనీ, ఈ దాడుల్లో ఓ ఇండియన్ వర్కర్ చనిపోగా, మరో ముగ్గురు ఇండియన్స్ గాయపడ్డారనీ, వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం షాప్‌ని ప్రారంభించిన కాస్సేపటికే ఈ దాడి జరిగింది. మృతుడ్ని ఇండియాలోని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కడప జిల్లా వాసి ఎ.వెంకటసుబ్బారెడ్డిగా గుర్తించారు. ఎనిమిది నెలల క్రితమే ఈయన కింగ్డమ్కి పని నిమిత్తం వచ్చారు. గాయపడ్డవారిలో అజాంగర్ ఉత్తరప్రదేశ్‌కి చెందిన సంతోష్‌కుమార్, కడపకి చెందిన ఓబులేష్, తెలంగాణలోని జగిత్యాలకు చెందిన కమలాకర్‌రావు ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







