ఇండియన్‌ స్కూల్స్‌లో 4,761 మంది విద్యార్థులకు అడ్మిషన్‌

- April 10, 2017 , by Maagulf
ఇండియన్‌ స్కూల్స్‌లో 4,761 మంది విద్యార్థులకు అడ్మిషన్‌

2017-18 సంవత్సరానికిగాను రికార్డు స్థాయిలో 4,761 మంది విద్యార్థులకు ఇండియన్‌ స్కూల్స్‌లో ఆన్‌ లైన్‌ ద్వారా అడ్మిషన్‌ కల్పించారు. కెసి 1 నుంచి 9వ తరగతి వరకు ఈ ప్రవేశాలున్నాయి. మార్చి 3న జరిగిన తొలి డ్రాలో 3,485 మంది విద్యార్థులకు సీట్లు అలాట్‌ చేయడం జరిగింది. ఇక్కడ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న కొందరికి రెండో డ్రా ద్వారా సీట్లను కేటాయించినట్లు ఒమన్‌ ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ తరఫున ప్రకటనలో పేర్కొన్నారు. అప్లికేషన్‌ పోర్టల్‌ ఆదివారం తాజా అడ్మిషన్లకోసం ఏప్రిల్‌ 9 నుంచి అందుబాటులోకి వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో నింపబడిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ని ప్రింట్‌ అవుట్‌ తీసుకుని, ఏ స్కూల్‌లో అయితే సీటు కోసం చూస్తున్నారో, ఆ స్కూల్‌ని సంప్రదించవలసి ఉంటుంది. ఇంకో వైపున న్యూ ఇండియన్‌ స్కూల్‌ అల్‌ అన్సాబ్‌లో 2019 ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com