సిత్ర గిడ్డింగిలో అగ్ని ప్రమాదం

- April 10, 2017 , by Maagulf
సిత్ర  గిడ్డింగిలో అగ్ని ప్రమాదం

స్థానిక సిత్ర గిడ్డంగిలో సోమవారం జరిగిన ఒక పెద్ద అగ్నిప్రమాదంపై కింగ్డమ్లో లోని సాయుధ దళ జట్ స్పందించింది. అల్యూమినియం మరియు నైలాన్ షీట్లు తయారీ ప్లాస్టిక్ రసాయన పదార్థాలు పెద్ద పరిమాణంలో ఉన్న ఒక గిడ్డంగి వద్ద సంభవించిన అగ్నిప్రమాదంను అదుపు చేయడానికి అగ్నిమాపక  సిబ్బంది దాదాపు12 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ముగ్గురు పౌర రక్షణ సిబ్బంది ఈ మంటలను ఆర్పే ప్రక్రియలో చిన్న గాయాలతో బయటపడ్డారు. సిత్ర ప్రాంతంలోని ఒక గిడ్డింగు వద్ద అగ్ని ప్రమాదం గూర్చి  తెలిసిన వెంటనే సివిల్ డిఫెన్స్ జట్లు ప్రమాద  సన్నివేశంకు తరలివెళ్లారు. 20 వాహనాల సహాయంతో  78 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. అంతేకాక అగ్నిజ్వాలలు ఆ సమీపంలోని ఇరుగు పొరుగు ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా నిరోధించినట్లు సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ చెప్పారు. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి వెనుక కారణం గుర్తించడానికి పరిశోధనలు జరిపి  పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదించనున్నట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com