బంగారు ఆభరణాల చోరీలో ఇరువురు ప్రవాసియ మహిళలకు ఆరునెలల జైలుశిక్ష

- April 11, 2017 , by Maagulf
బంగారు ఆభరణాల చోరీలో ఇరువురు ప్రవాసియ  మహిళలకు ఆరునెలల జైలుశిక్ష

దోహా:పరాయి వార్ పసిడి  పాము వంటివని ఆ ప్రవాసీయ మహిళలు ఇపుడు ముక్కు చీదుకొంటూ  పశ్చాత్త్తపం చెందుతున్నారు. బతుకు తెరువు కోసం వచ్చిన ఆ విదేశీ మహిళలు పార్ట్ టైం దొంగతనాలు చేసి మరింత సంపాదచాలనే పాడు బుద్ధితో దుష్ట యోచన చేశారు. స్థానిక సోయుక్యూ వాకీఫ్ వద్ద ఒక బంగారు నగల దుకాణంకు వెళ్ళి చేతివాటం ప్రదర్శించారు. ఏదో నగలు కొనేవారు మాదిరిగా అక్కడకు వెళ్ళి  ఆభరణాలు చూపించేవారి దృష్టి మళ్లించి వారు గమనించినప్పుడు ఆయా ఆభరణాన్ని హ్యాండ్ బాగ్లో వేసుకోసాగారు. అయితే ఆ దుకాణంలో ఉన్న నిఘా కెమెరా వీరి చేష్టలను నిశితంగా రికార్డ్ చేసింది. అదేదో తమ సొంత షాప్ మాదిరిగా  వివిధ బంగారు ఆభరణాలు అంశాల వారీగా దొంగిలించినందుకు దోహా క్రిమినల్ న్యాయస్థానం ఆ మహిళామణులను ఆరు నెలల కాలం కారాగారంకు పంపించారు. అలాగే శిక్షా కాలం ముగిసిన తర్వాత దేశ బహిష్కరణకు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com