సెలబ్రిటీ గన్‌ షాట్‌: ఇద్దరి అరెస్ట్‌

- April 11, 2017 , by Maagulf
సెలబ్రిటీ గన్‌ షాట్‌: ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌: ఇబ్రిలోని అల్‌ దురైజ్‌ విలేజ్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరు వ్యక్తులు గాల్లోకి తుపాకీలను కాల్చిన ఘటనలో (సెలబ్రిటీ గన్‌ షాట్‌) ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు దహిరా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సెలబ్రిటీ గన్‌ షాట్స్‌ కారణంగా పలు సందర్భాల్లో మరణాలు చోటు చేసుకున్నాయనీ, ఆర్టికల్‌ 25 - వెపన్స్‌ అండ్‌ అమ్యూనిషన్‌ యాక్ట్‌ ప్రకారం ఇది శిక్షార్హమైన నేరమని చెప్పారాయన. నిబంధనల్ని ఉల్లంఘించినవారికి 200 రాయల్‌ ఒమన్‌ రియాల్స్‌ జరీమానాతోపాటు, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com