ఇండియన్ ఐడల్‌కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సన్మానం
- April 12, 2017
ఇండియన్ ఐడల్ సీజన్ 9 టైటిల్ సాధించిన రేవంత్, ఫైనలిస్ట్ రోహిత్‌లను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సన్మానించారు. బుధవారం ఆయన నివాసంలో రేవంత్, రోహిత్‌లను కలిసిన కేటీఆర్ వారికి అభినందనలు తెలియజేశారు. ఇరువురికి శాలువా కప్పి, మెమొంటోతో సన్మానించారు. ఆ తర్వాత వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను తెలంగాణ ఐటీశాఖ ట్విటర్లో పోస్టు చేసింది.
ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ‘ఇండియన్ ఐడల్’లో తెలుగు తేజాలు రేవంత్, రోహిత్‌లు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న జరిగిన తుదిపోరులో యువ గాయకుడు రేవంత్ టైటిల్ విజేతగా నిలిచాడు. రోహిత్ మూడోస్థానం దక్కించుకున్నాడు. రేవంత్ ఇండియన్ ఐడల్ బిరుదుతో పాటు రూ. 25లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఇండియన్ ఐడల్‌గా నిలిచిన రెండో తెలుగు గాయకుడు రేవంత్ కావడం విశేషం.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







