ఐఎస్సి సలాలా కొత్త మేనేజ్మెంట్ కమిటీ
- April 13, 2017
ఇండియన్ స్కూల్ క్లబ్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ తాజాగా జరిగింది. ఇండియన్ సోషల్ క్లబ్ మస్కట్ డిప్యూటీ ఛైర్మన్ నేతృత్వంలో ఈ ఎన్నిక జరిగింది. సిఎం సర్దార్, కెజె జార్జ్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. మొత్తం 510 ఓటర్లలో, 426 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 19 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మన్‌ప్రీత్ సింగ్, ఛైర్మన్‌గా మరోసారి ఎంపికయ్యారు. ఇది ఆయనకు వరుసగా ఐదో గెలుపు. మోహన్‌దాస్ ఎన్‌కె వైస్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. హృదయ ఎస్ మీనన్ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ జనరల్ సెక్రెటరీగా రాకేష్ కుమార్ ఝా, ట్రెజరర్‌గా గిరీష్ కుల్కర్ణి ఎంపికయ్యారు. జాయింట్ ట్రెజరర్ పోస్ట్ హరికుమార్ డి, స్పోర్ట్ సెక్రెటరీగా అజిత్ ఎన్నికయ్యారు. జాయింట్ స్పోర్ట్స్ సెక్రెటరీ బినో జోసెఫ్, కల్చరల్ సెక్రెటరీ రమేష్ కుమార్ కెకె విజయం సాధించారు. సంతానం కె, ఎంపి సంతోష్, మోహన్‌దాస్ తంపి తదితరులు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్లుగా ఎంపికయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









