వర్కర్స్‌కి మాత్రమే అండ, బాస్‌లకి కాదు

- October 01, 2015 , by Maagulf
వర్కర్స్‌కి మాత్రమే అండ, బాస్‌లకి కాదు

ఒప్పందాల ప్రకారం కార్మికులకు సెటిల్‌మెంట్‌ చేయకుండా, వారిని చిన్న చిన్న లూప్‌హోల్స్‌ని అడ్డం పెట్టుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న సంస్థలను ఉపేక్షించబోమని మానవ వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు నసర్‌ అల్‌ సది చెప్పారు. కంపెనీలపై వలస కార్మికులు ఫిర్యాదులు చేస్తే, వారి ఫిర్యాదుల్లో నిజాయితీని బట్టి చర్యలుంటాయని అన్నారు. అమ్నెస్టీ ద్వారా 21 వేల మంది వలస కార్మికులు సొంత దేశాలకు తరలి వెళ్ళారన్నారు. అక్టోబర్‌ 31 వరకూ అమ్నెస్టీ వలస కార్మికులకు అందుబాటులో ఉండనుంది. ఉద్యోగ కల్పనా రంగంలోని ఇబ్బందుల్ని గుర్తించామనీ, వాటిని సరిచేసి ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా చేస్తామన్నారు నసర్‌ అల్‌ నది. అమ్మెస్టీ సహాయంతో 14 వేల మందికి పైగా బంగ్లాదేశీయులు స్వదేశానికి వెళ్ళినట్లు బంగ్లాదేశ్‌ ఎంబసీ చెప్పింది. పాకిస్తాన్‌కు 4 వేల మంది వెళ్ళగా, సుమారు 3 వేల మంది అమ్నెస్టీకి దరఖాస్తు చేసుకుని ఉన్నారు. 

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com