నైజీరియాలో వైరస్ సోకి ఆరోగ్య అత్యవసర పరిస్థితి
- April 13, 2017
- ప్రాణాంతక వైరస్ సోకి 489 మంది మృతి
నైజీరియాలో మెనింజ్కెటిస్ (మెదడు వాపు) వ్యాధి తీవ్రరూపం దాల్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యాధితో 489 మంది మర ణించారని నైజీరియా ఆరోగ్యశాఖ మంత్రి ఇస్సాక్ బుధవారం మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు. అయితే దేశంలో దాదాపు మరో 5 వేల మందికీ ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు గుర్తించామని, దీనికి విరుగుడుగా పనిచేసే బెక్స్‌సెరో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి చెప్పారు. దీంతో నైజీరియాలో ఆరోగ్య శాఖ మంత్రి అత్యవ సర పరిస్థితి ప్రకటించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బెక్స్‌సెరో వ్యాక్సిన్ కొరత ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్య క్తం చేశారు. చనిపోయినవారిలో అత్యధికులు జంపారా ప్రాంతానికి చెంది నవారేనని, కత్సిన, కెబ్బీ, నైగర్, సొకొటో రాష్ట్రాల్లోనూ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నట్టు వివరించారు. పేద దేశమైన నైజీరియాలో తరచూ ప్రమాదకర వ్యాధులుప్రబలటం, పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడటం జరుగుతున్నది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్‌లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









